Ranganadha swamy kalyanam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో చివరి రోజైన నేడు గోదాదేవి రంగనాథస్వామి కల్యాణం నిర్వహించారు. పుణ్యాహవాచనం విశ్వక్సేన ఆరాధన కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధ్యయనోత్సవాల్లో నిర్వహిస్తున్న విలాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం సీతారాములు దసరా మండపం వద్ద పూజలు అందుకోనున్నారు.
సంక్రాంతి సెలవుల సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. రేపు మకర సంక్రాంతి సందర్భంగా సీతారాములకు ఉదయం పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం రథోత్సవం వేడుక నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి: