Sri Ramanavami celebrations: భద్రాద్రి రామయ్య మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 10న శ్రీరామనవమిని పురస్కరించుకుని కల్యాణ ఉత్సవాల్లో భక్తులను పాల్గొనేందుకు అనుమతిస్తామని మంత్రి పేర్కొన్నారు.
'శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ ఉత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తాం. కల్యాణ వేడుకను నిర్వహించే మిథిలా స్టేడియాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశాం. భక్తుల సమక్షంలో భద్రాద్రి రాములోరి కల్యాణం. ఏప్రిల్ 2న శుభకృత నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తాం.'
-ఇంద్రకరణ్ రెడ్డి , దేవాదాయ శాఖ మంత్రి
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ పరిసరాల్లో వెదురు తడికలతో కూడిన చలువ పందిళ్లను నిర్మించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:CM KCR Statements: వీఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్‌న్యూస్.. అసెంబ్లీలో సీఎం ప్రకటన..