ETV Bharat / state

మణుగూరలో చోరీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో 10 తులాల బంగారం, వెండి, 7వేల నగదు ఎత్తుకెళ్లిన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

చోరీ జరిగిన ప్రదేశం
author img

By

Published : Jul 19, 2019, 11:35 PM IST

మణుగూరులో దొంగలు రెచ్చిపోయారు. గురువారం అర్ధరాత్రి పట్టణంలోని ఆదర్శనగర్​కు​ చెందిన బొగ్గెం నాగేశ్వరరావు అతని కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా దొంగలు ఇంట్లోకి చొరబడి చోరీ చేశారు. 10 తులాల బంగారం, వెండి వస్తువులు, 7వేల నగదు దొంగతనం చేశారు. ఘటనా స్థలిని డీఎస్పీ సాయిబాబా, సీఐ రమేశ్​ బాబు పరిశీలించారు.

మణుగూరులో దొంగలు రెచ్చిపోయారు. గురువారం అర్ధరాత్రి పట్టణంలోని ఆదర్శనగర్​కు​ చెందిన బొగ్గెం నాగేశ్వరరావు అతని కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా దొంగలు ఇంట్లోకి చొరబడి చోరీ చేశారు. 10 తులాల బంగారం, వెండి వస్తువులు, 7వేల నగదు దొంగతనం చేశారు. ఘటనా స్థలిని డీఎస్పీ సాయిబాబా, సీఐ రమేశ్​ బాబు పరిశీలించారు.

మణుగూరలో చోరీ

ఇదీ చూడండి : 9నెలల్లో బాబ్రీ కేసు తీర్పు ఇవ్వాలి: సుప్రీం

Intro:మావోయిస్టులకు సాయపడే వారిపై ప్రత్యేక నిఘా


Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు.
మావోయిస్టులకు సాయపడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు మణుగూరు డిఎస్పి ఆర్ సాయి బాబా తెలిపారు. మణుగూరు పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడారు. మావోయిస్టులు తన సొంత ప్రయోజనాల కోసం అమాయక గిరిజనులను మాయ మాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు తుడుం దెబ్బ, మావోయిస్టు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంఘాల సాయంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉందని పేర్కొన్నారు .ప్రజల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తోందని, ఏజెన్సీ ప్రాంత సమస్యల పేరుతో ఆదివాసీ సంఘాల రెచ్చగొట్టే ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉందని తెలిపారు.


Conclusion:మావోయిస్టులకు సహకరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనుమతులు లేకుండా ర్యాలీలు ధర్నాలు చేస్తే వారిపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.