ETV Bharat / state

భద్రాద్రి రామాలయంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు

Draupadi Murmu Visit to Bhadradri Temple : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమ్మక్క, సారలమ్మ పూజారుల సమ్మేళనంలో పాల్గొన్న ఆమె.. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అంటూ దాశరథి కవిత్వాన్ని వినిపించారు.

Draupadi Murmu visit to Bhadrachalam
Draupadi Murmu visit to Bhadrachalam
author img

By

Published : Dec 28, 2022, 12:58 PM IST

Updated : Dec 28, 2022, 2:58 PM IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Draupadi Murmu visit to Bhadradri temple : భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ద్రౌపది ముర్ము వెంట గవర్నర్‌ తమిళిసై, మంత్రులు సత్యవతి రాఠోడ్​, పువ్వాడ అజయ్‌కుమార్‌, ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రధాన ఆలయంలో సీతారాముల స్వామికి రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీ తయారు అమ్మవారి ఆలయంలో అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.

శాలువాతో సత్కరించి స్వామివారి తీర్ధ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 'ప్రసాద్‌' పథకం శిలాఫలకం రాష్ట్రపతి ఆవిష్కరించారు. అంతకముందు భద్రచలానికి చేరుకున్న ద్రౌపది ముర్ముకు మంత్రులు, ఉన్నతాధికారులు హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లి స్వాగతం పలికారు.

President Draupadi Murmu visit to Bhadrachalam
భద్రాద్రిలో రాష్ట్రపతి పర్యటన

తెలుగులో మాట్లడిన ద్రౌపది ముర్ము: అనంతరం భద్రాచలంలో నిర్వహించిన సమ్మక్క, సారలమ్మ పూజారుల సమ్మేళనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. కొమ్ము, రేల నృత్యాలతో గిరిజనులు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. కుమురం భీం ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో రెండు ఏకలవ్య ఆదర్శ పాఠశాలలను ద్రౌపది ముర్ము వర్చువల్‌గాప్రారంభించారు. అనంతరం ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు.

'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అంటూ దాశరథి కవిత్వాన్ని వినిపించారు. భద్రాద్రి రాములవారిని దర్శించుకోవడం, సమ్మక్క, సారలమ్మ పూజారుల సమ్మేళనంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ ఏకలవ్య పాఠశాలలు మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. గిరిజన పిల్లలు చదువుకుంటే వారి కుటుంబమే కాకుండా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ద్రౌపది ముర్ము అన్నారు.

గిరిజన బిడ్డ కావడం మనందరికీ గర్వకారణం: కార్యక్రమంలో మాట్లాడిన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​.. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ ప్రభుత్వం కాపాడుతోందని పేర్కొన్నారు. గిరిజన బిడ్డ రాష్ట్రపతి కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు. ఏకలవ్య పాఠశాలల ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్య లభిస్తోందన్నారు. 8 ఏళ్లలో 1,200 మంది గిరిజన విద్యార్థులు ఇంజినీరింగ్‌, డాక్టర్‌ చదివేందుకు అర్హత సాధించారన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 28, 2022, 2:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.