ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా... భద్రాచలంలోని బ్రిడ్జి సెంటర్లో గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రేమికులు మొక్కలు నాటారు. అభయాంజనేయ స్వామి పార్కులో మొక్కలు నాటారు. మొక్కలు నాటడం వలన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని స్థానికులకు అవగాహన కల్పించారు.
అంతకుముందు.. పట్టణంలో ఎక్కడెక్కడ మొక్కలు నాటాలన్న అంశంపై సమావేశమైన సంస్థ సభ్యులు.... పలు ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. ఎటువంటి మొక్కలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. పట్టణంలోని అనేక ప్రాంతాల్లో గ్రీన్ భద్రాద్రి నిర్వాహకులు వేలాది మొక్కలు నాటి... సంరక్షిస్తున్నారు.