ETV Bharat / state

అందరూ ఉన్నా.. అనాథగా 'అమ్మ' - ఆస్తి కోసం కుమారుల మధ్య తగాదాలు

తన కుమారులే సర్వస్వంగా భావించి, పెంచి పెద్ద చేసిన తల్లినే ఇద్దరు కుమారులు విస్మరించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒరియా తండాలో చోటుచేసుకుంది. ఆస్తి కోసం కొడుకులు పట్టించుకోకపోవడం వల్ల ఆ తల్లి తల్లడిల్లిపోతున్నారు.

one-mother-story-in-bhadradri-kothagudem-district
అందరూ ఉన్నా.. అనాథగా 'అమ్మ'
author img

By

Published : May 17, 2020, 11:27 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని ఒరియా తండాకు చెందిన తేజావత్ బాలి అనే 55 ఏళ్ల మహిళ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. తన భర్త దిల్​షా 15 ఏళ్ల క్రితం చనిపోగా.. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తనకున్న ఆస్తిని ఇద్దరు కుమారులకు ఆమె పంచింది. చివరకు తన వద్ద ఉన్న ఆస్తిని విక్రయించి కొంత డబ్బు వెచ్చించి హైదరాబాద్​లో చికిత్స చేయించుకుంది. తల్లి వద్ద ఉన్న మిగిలిన డబ్బు విషయంలో ఇద్దరు కుమారుల మధ్య తగాదాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో వంతులవారీగా తల్లిని చూసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

వారివురి మధ్య తగాదాల వల్ల తల్లిని పట్టించుకోకపోవడంతో తల్లి పరిస్థితి దయనీయంగా మారింది. నడవలేని స్థితికి చేరింది. గ్రామ పెద్దలు చెప్పినా వారు వినకపోవడం వల్ల పోలీసులు కుమారులకు సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నప్పుడు అభిమానంగా చూసుకున్న కుమారులు ఆస్తి విషయంలో తగాదాలు పడి.. అనారోగ్యంతో ఉన్న సమయంలో పట్టించుకోకపోవడం పట్ల మాతృమూర్తి జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ ఈనెల 31 వరకు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.