భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తి పలు ఇళ్లు నీటమునిగాయి. పట్టణంలోని సుందరయ్య నగర్, గాంధీనగర్, ఇందిరానగర్, ఆదర్శనగర్, సమితి సింగారం కాలనీల్లోకి వరద నీరు చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కట్టు వాగు, మెట్ల వాగులు ఉధృతంగా ప్రవహించాయి. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల లోతట్టు ప్రాంతాల్లో పురపాలక కమిషనర్ వెంకటస్వామి, తహసీల్దార్ మంగీలాల్ పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి: తీర్పు రిజర్వ్: కూల్చడమా.. మిగల్చడమా?