భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పలు గ్రామాలలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు ఊపందుకున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె కారణంగా ప్రారంభంలో తక్కువ సంఖ్యలో కూలీలతోనే పనులు ప్రారంభమయ్యాయి. కానీ... లాక్డౌన్ వల్ల ఇతర పనులు లేకపోవడం, దినసరి కూలీగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి డబ్బులు ఇవ్వటం వల్ల ప్రస్తుతం పనులు ఊపందుకున్నాయి.
ఆయా పంచాయతీల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు పర్యవేక్షణ చేస్తున్నారు. లాక్డౌన్ కొనసాగుతున్న కారణంగా కూలీలకు అవగాహన కల్పిస్తూ.. మాస్కులు, భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపడుతున్నారు.