సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్ గనిలో కాలుష్య ప్రభావంపై నిపుణుల కమిటీని ఎన్జీటీ చెన్నై బెంచ్ ఏర్పాటు చేసింది. నవంబరు 9లోగా నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ చెన్నై బెంచ్ ఆదేశించింది. సత్తుపల్లి వాసి నందునాయక్ వేసిన పిటిషన్‌పై విచారించింది.
పేలుళ్ల వల్ల ఎన్‌టీఆర్ కాలనీలో 700 ఇళ్లు దెబ్బతిన్నాయని న్యాయవాది వాదించారు. జలగం ఓపెన్ కాస్ట్ గనిలో క్లోజింగ్ ప్లాన్ అమలు చేయలేదని పేర్కొన్నారు. స్పందించిన బెంచ్... కేంద్ర పర్యావరణశాఖ, తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి కాలరీస్, ఖమ్మం కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.