ETV Bharat / state

కన్నీటి గాథపై స్పందించిన మానవత్వం

కుమారుడికి అంత్యక్రియలు చేయలేని దుస్థితిలో... బిడ్డ మృతదేహాన్ని రిక్షాలో తీసుకెళ్లి అంత్యక్రియలు చేసిన తల్లి దయనీయ పరిస్థితిపై ఈటీవీ భారత్​ ప్రచురించిన కథనంపై పులువురు స్పందించారు. భద్రాచలంలోని మదర్​ థెరిసా చారిటబుల్​ ట్రస్ట్​ బాధిత కుంటుంబానికి ఆర్థిక సాయం అందించారు.

mother teresa trust respond on etv bharat story
కన్నీటి గాథపై స్పందించిన మానవత్వం
author img

By

Published : May 15, 2020, 12:57 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పేద కుటుంబం దయనీయ స్థితిపై ఈటీవీ భారత్, ఈటీవీ​లో ప్రచురితమైన కథనంపై పలువురు స్పందించారు. లాక్‌డౌన్‌ కారణంగా చేతిలో చిల్లిగవ్వ లేని ఓ తల్లి... అనారోగ్యంతో చనిపోయిన కుమారుడి మృతదేహాన్ని రిక్షాలో తీసుకెళ్లింది. దహనసంస్కారాలు చేసే స్థామత లేక గోదారి ఒడ్డున ఇసుకలో పూడ్చిపెట్టింది.

తల్లి దీన స్థితిపై ఈటీవీ భారత్​లో​ "ఈ బాధ ఏ తల్లికి రావొద్దు.. రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు" పేరుతో ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించి ఆర్థిక సాయం అందించారు. తాజాగా... మదర్‌ థెరిసా ట్రస్టు స్పందించి బాధిత కుటుంబానికి నిత్యావసర సరకులు, ఇతర సామగ్రి, నగదు అందజేసి వారికి అండగా నిలిచింది.

ఇదీ చూడండి: ఈ బాధ ఏ తల్లికి రావొద్దు.. రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.