కేంద్రంలో భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భాజపా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇల్లందు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక భాజపా నాయకులు పాల్గొన్నారు. కేంద్రం నుంచి అనేక నిధులు పథకాలు వస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం అవి తమ పథకాలుగా చెప్పుకుంటోందని అబ్బయ్య ఆరోపించారు.
సేవలు భేష్..
జమ్మూ కశ్మీర్, రామజన్మభూమి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించిన ఘనత మోదీకే దక్కుతుందని అబ్బయ్య అన్నారు. ప్రపంచంలోని పలు దేశాల నేతలు, ప్రజలు.. మోదీ నాయకత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని భాజపా నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో భాస్కర్ నాయక్, కుటుంబరావు, నాగ స్రవంతి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: దేశంలో మరో 9,985 కేసులు, 279 మరణాలు