భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జేకే ఉపరితల గని, భూగర్భ గనుల్లో చిరు 'ఆచార్య' సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. షూటింగ్‌లో పాల్గొనడానికి మొట్టమొదటి సారిగా ఇల్లందు బొగ్గు గనికి మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఏరియా జీఎం పీవీ సత్యనారాయణ పుష్పగుచ్ఛంతో చిరుకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి బొల్లం వెంకటేశ్వర్లు, సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కృత్రిమ అవయవాల దాత.. విధివంచితుల పాలిట వెలుగుప్రదాత