భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 17వ ఆవిర్భావ వారోత్సవాలు మంగళవారం నుంచి జరుగనున్నాయి. వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్, పార్టీ అధికార ప్రతినిధి జగన్‌తో పాటు బీకేటీజీ (భద్రాద్రి కొత్తగూడెం-తూర్పుగోదావరి) డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ లేఖలు విడుదల చేశారు.
కొత్త సారథి.. వారిద్దరిలో ఒకరేనా?
మావోయిస్టు(Communist Party of India..Maoist) పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న యాపా నారాయణ(Yapa Narayana) అలియాస్ హరిభూషణ్(Haribhushan) ఇటీవల కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారోత్సవాల్లో కొత్త సారథిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. యుద్ధతంత్రంలో ఆరితేరిన బడే చొక్కారావు(Bade Chokkarao) అలియాస్ దామోదర్(Damodar)కు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
నిఘా వర్గాల హెచ్చరిక...
తమ ఉనికిని చాటుకునేందుకు వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టు(Communist Party of India..Maoist)లు హింసాత్మక సంఘటనలకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. మన్యంలో కీలకమైన ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.
మూడురోజుల క్రితమే దుబాసి శంకర్ అరెస్టు...
ఏవోబీలోని కొరాపుట్, మల్కాన్‌గిరి, విశాఖపట్నం జిల్లాల్లో మావోయిస్టు(Communist Party of India..Maoist) కీలకనేత దుబాసి శంకర్ అలియాస్ మహేందర్ అలియాస్ అరుణ్ అలియాస్ రమేష్‌ను ఒడిశాలో సోమవారం అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ అభయ్ తెలిపారు. ఆయన మంగళవారం భువనేశ్వర్‌లో విలేకర్లతో మాట్లాడారు. 'కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పేటగడ అటవీ ప్రాంతంలో ఎస్‌వోజీ, జిల్లా వాలంటరీ దళం, బీఎస్‌ఎఫ్, రాష్ట్ర పోలీసులు కూంబింగ్ చేసి.. నోయరో గ్రామంలో శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడివద్ద ఇన్సాస్ రైఫిల్, 10రౌండ్ల బుల్లెట్లు, ఇతర సామగ్రి, రూ.35,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడి ఆచూకీ చెప్పినవారికి రూ.20 లక్షల బహుమతి ఇస్తామని గతంలో ప్రకటించాం' అని ఒడిశా డీజీపీ అభయ్ తెలిపారు.
శంకర్‌ది తెలంగాణే...
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్లనర్సంపల్లికి చెందిన శంకర్ 1987 నుంచి తీవ్రవాద(Communist Party of India..Maoist) ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతని భార్య భారతక్క 2016లో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్-ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారని డీజీపీ తెలిపారు.
తీగలమెట్ట ఘటనతో సంబంధం..
ఈ ఏడాది విశాఖపట్నం జిల్లా తీగలమెట్టలో జరిగిన ఎదురుకాల్పుల్లో అతడి హస్తం ఉందన్నారు. 2010లో గోవిందపల్లిలో మందుపాతర పేలి 11 మంది ఒడిశా పోలీసులు, అనంతరం చిత్రకొండలోని జానిగుడలో జరిగిన కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మరణించారని, ఆ ఘటనలతో అతడికి సంబంధం ఉందని తెలిపారు. శంకర్ దుబాసీ 1987లో పార్టీలో చేరి.. 2003 నాటికి ఎస్‌జడ్‌సీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. అప్పటి నుంచి ఏవోబీలోనే పనిచేస్తున్నారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, కొరాపూట్ జిల్లాల్లో 20, తెలంగాణ రాష్ట్ర పరిధిలో 24 కేసులు శంకర్‌పై ఉన్నాయి.
ఇదీ చూడండి: శ్రీరామనగరం ఏంటి? ప్రపంచంలోనే రెండో ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహ ప్రత్యేకతలేంటో తెలుసా?