భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజుపేట గ్రామ మహిళలు బొగ్గు లారీలను అడ్డుకున్నారు. మణుగూరు ఓసీ గనికి వెళ్లే లారీల వల్ల విపరీతమైన దుమ్ము వస్తోందని వాపోయారు. లారీలు అతి వేగంగా ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు వెళ్లే సమయంలో రహదారులపై నీరు చల్లాలని, లేనిపక్షంలో బొగ్గు లారీలు తమ గ్రామం నుంచి వెళ్లేందుకు అనుమతించమని హెచ్చరించారు.
మహిళల రాస్తారోకోతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు రహదారులపై బొగ్గు లారీలు వెళ్లేటప్పుడు నీరు చల్లుతామని హామీ ఇవ్వగా మహిళలు ఆందోళన విరమించారు.
- ఇదీ చూడండి : సైకత శిల్పి సుదర్శన్‌కు అంతర్జాతీయ పురస్కారం