భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఇవాళ జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించింది. 11 వార్డులకు ఎన్నికలు జరగగా 9 వార్డులు మహాకూటమి కైవసం చేసుకోగా రెండు వార్డులను తెరాస కైవసం చేసుకుంది.
మహా కూటమి తరపున తెదేపా అభ్యర్థి అబ్బినేని శ్రీనివాస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. మహాకూటమి భారీ మెజార్టీతో గెలవటం వల్ల కాంగ్రెస్, తెదేపా, సీపీఎం, సీపీఐ నాయకులు సంబరాలు చేసుకున్నారు.
ఇవీ చూడండి: 'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి