Bhadradri Adhyanotsavalu: భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఐదోరోజు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకొక అవతారంలో భక్తులకు శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనమిస్తున్నారు. నేడు వామనావతారంలో భక్తులకు అభయమిచ్చారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను ఆలయ అర్చకులు.. అలంకరించి పూజలు చేశారు. నిత్య కల్యాణ మండపం వద్దనే వామనావతారంలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సేవలు, ఊరేగింపులు రద్దు చేశారు. ఈనెల 12న జరగనున్న తెప్పోత్సవం, 13న జరగనున్న ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీ చేశారు. ఆలయ అర్చకులు వేద పండితుల నడుమ ఉత్సవాలు ఏకాంతంగా జరుగుతాయని తెలిపారు.
ఇదీ చదవండి: High Court about Corona : పిల్లల కోసం వైద్య సదుపాయాలు మరింత పెంచాలి: హైకోర్టు