ETV Bharat / state

ఎంపీటీసీని చంపడం హేయమైన చర్య: ఎస్పీ - mavoist

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు హతమార్చడాన్ని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తీవ్రంగా ఖండించారు. నిందితులను వదిలేది లేదని స్పష్టం చేశారు.

ఎంపీటీసీని చంపడం హేయమైన చర్య: ఎస్పీ
author img

By

Published : Jul 12, 2019, 8:20 PM IST

తెరాస ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాస్​ను మావోయిస్టులు కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టి హతమార్చటం హేయమైన చర్య అని జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ అన్నారు. శ్రీనివాస్ పోలీస్ ఇన్ఫార్మర్ కాదని, డిపార్ట్​మెంట్​తో అతనికి ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. అధికార పార్టీ ఎంపీటీసీని మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ఛత్తీస్​గఢ్ ప్రాంతానికి తీసుకెళ్లి ఈరోజు తెట్టేమడుగు, పుట్టపాడు గ్రామాల మధ్యలో హత్య చేసినట్లు వెల్లడించారు.

శ్రీనివాస్ వ్యవసాయం చేస్తూ చుట్టుపక్కల ఉన్న రైతులకు సహాయం చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. మావోయిస్టులు తమ మనుగడ కోసం చర్ల ఏరియాకి సంబంధించిన రైతులను, వ్యాపారస్తులను డబ్బుల కోసం వేధిస్తుంటారన్నారు. రైతులకు అండగా నిలిచే ఇలాంటి వ్యక్తులను టార్గెట్ చేసి చంపుతూ ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తున్నారని ఎస్పీ అన్నారు. ఈ విధమైన సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే మావోయిస్టులపై చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు.

ఇవీ చూడండి: సచివాలయం మళ్లీ చూస్తానో లేదో.. సెల్ఫీ తీసుకుంటా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.