ETV Bharat / state

విశాఖ ఘటనతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వణుకు

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మొత్తం 210 పరిశ్రమలున్నాయి. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో పారిశ్రామికవాడలు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు మూసి వేసినప్పటికీ మళ్లీ తెరిచేందుకు సన్నాహాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలోని విశాఖపట్నం సమీపంలో ఓ పరిశ్రమ నుంచి విషవాయువు లీకై పలువురు మృత్యువాతపడ్డారు. వందల మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనతో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి.

khammam district people afraid of vizag gas leak incident
మనకుందా.. వాయు గండం!
author img

By

Published : May 8, 2020, 10:08 AM IST

విశాఖ గ్యాస్​ లీక్​ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పరిధిలోని పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంపై ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆయా పరిశ్రమలు నిబంధనల మేరకు మాత్రమే వాయు ఉద్గారాలు విడుదల చేస్తున్నాయని కాలుష్య నియంత్రణ మండలి చెబుతోంది.

ఉభయ జిల్లాల్లో వెలువడే వాయువులివీ..

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గ్రానైట్‌, బొగ్గు, కాగితం, విద్యుత్తు, భారజల కేంద్రం తదితర పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి ప్రధానంగా నాలుగు రకాల వాయువులు వెలువడతాయని అధికారికంగానే వెల్లడిస్తున్నారు. అయితే అవి తగిన మోతాదులోనే ఉద్గారాలు విడుదల చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

  • - హైడ్రోజన్‌ సల్ఫైడ్‌
  • - కార్బన్‌ మోనాక్సైడ్‌
  • - కార్బన్‌ డై ఆక్సైడ్‌
  • - నైట్రిక్‌ ఆక్సైడ్‌

కాలుష్యం హద్దుమీరితే..

  • రేణువులు(ఎన్‌సీఎం): శ్వాసకోశ సంబంధ వ్యాధులు
  • సల్ఫర్‌ డై ఆక్సైడ్‌: శ్వాసకోశాలకు చికాకు కలిగించి, బోంకటీస్‌కు దారితీసే అవకాశం
  • నైట్రోజన్‌-డై-ఆక్సైడ్‌: కళ్లు, ముక్కు మండటం, శ్వాసకోశాలకు తీవ్ర చికాకు
  • కార్బన్‌ మోనాక్సైడ్‌: శరీర జీవకణాలకు ఆక్సిజను లేకుండా చేస్తుంది. అపస్మారక స్థితి ఏర్పడుతుంది
  • హైడ్రోకార్బన్లు: కేంద్ర నరాల వ్యవస్థకు నష్టం కలిగిస్తాయి
  • క్లోరిన్‌: ఊపిరితిత్తులకు తీవ్రంగా మంట కలుగుతుంది. కళ్లు మంటపుడతాయి
  • హైడ్రోజన్‌ సల్ఫైడ్‌: శ్వాసకోశాలకు పక్షపాతం తక్షణమే మూర్చపోతాం
  • సీసం(లెడ్‌): మెదడు పాడైపోడం, కండరాల పక్షపాతం, అనారోగ్యం

వేధిస్తున్న కాలుష్యం

  • ఉభయ జిల్లాల్లో ప్రాణాంతక వాయువుల పరిశ్రమలు ఏమీ లేవు
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ పరిశ్రమ నుంచి గోదావరిలోకి నీటి కాలుష్య కారకాలు విడుదల చేస్తోందనే ఆరోపణలున్నాయి.
  • ఈ పరిశ్రమ కారణంగా స్థానికులు చర్మ, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారనే వాదనలున్నాయి.
  • పాల్వంచలోని కేటీపీఎస్‌లో ఐదో, ఆరో, ఏడో దశ మాత్రమే ఇపుడు నడుస్తున్నాయి. ఈ ప్రాంతంలో కాలుష్య ప్రభావిత గ్రామాలు సుమారు 14 ఉన్నాయి.
  • బొల్లోరిగూడెం, వెంగళరావుకాలనీ, సురారం, పాండురంగాపురం, బిక్కుతండా, కరకవాగు గ్రామాల్లో కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంటోంది.
  • బూడిదవాగులో ప్రవహించే నీటిని తాగి పశువులు వచ్చి మృతిచెందిన దాఖలాలున్నాయి
  • కేటీపీఎస్‌లో బొగ్గు కాల్చే సమయంలో సల్ఫర్‌డై ఆక్సైడ్‌, నైట్రిక్‌ ఆక్సైడ్‌, మెర్క్యూరీ విడుదలవుతున్నాయి.
  • పాల్వంచలో జల, వాయు కాలుష్య కారకాలకు నిలయాలుగా మారుతున్నాయి.
  • పాల్వంచలోనే మరో పరిశ్రమ కారణంగా జగ్గుతండా, ఎర్రగుంట, పాలకోయతండా ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.
  • ఇల్లెందు ఉపరితల గని నుంచి పెద్ద ఎత్తున శబ్దంతో బొగ్గును తీస్తుండటంతో వాటి తీవ్రతను తగ్గించాలని స్వయంగా కలెక్టర్‌ ఆదేశించడం విశేషం.

నిబంధనలకనుగుణంగానే..

ఉభయ జిల్లాల్లో విషపూరిత వాయువులు విడుదల చేసే పరిశ్రమలు పెద్దగా లేవు. ఉన్న పరిశ్రమల నుంచి విడుదలయ్యే వాయువులన్నీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఉంటున్నాయి.

రవిశంకర్‌, పీసీబీ ఈఈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.