Innovative farewell to the teacher in Bhadradri: విద్యాబోధన చేసే ఉపాధ్యాయులకు పిల్లలు చదువుకుని మంచి స్థాయికి చేరాలని ఆశిస్తారు. విద్యార్థులు తమకు అక్షరాలు నేర్పిన గురువులకు గురుదక్షిణగా ఏదో చేయాలని అనుకుంటారు. అందుకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెనకతండాలో బదిలీపై వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఘనంగా సన్మానం చేశారు. వినూత్నంగా వీడ్కోలు పలికారు. తండాలో పదేళ్లపాటు ఉపాధ్యాయుడిగా పని చేసిన సోనీమియా ఇటీవల బదిలీపై నేలకొండపల్లికి వెళ్లారు.
Innovative farewell to the teacher in Bhadradri: విద్యార్థులతో పాటు ఊరంతా కలిసి ఉపాధ్యాయుడి కుటుంబాన్ని తండాకు పిలిచి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎడ్లబండిపై ఊరేగింపుగా గ్రామ శివారు వరకు తీసుకెళ్లి వీడ్కోలు పలికారు. పూర్వ విద్యార్థులు ఎడ్లబండి కాడిని లాగుతూ గురుభక్తిని చాటుకున్నారు. ఉపాధ్యాయుడు సోనిమియా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని గ్రామస్థులు తెలిపారు. తొమ్మిదేళ్లలో 25 మంది విద్యార్థులను గురుకులాలకు పంపించారని పేర్కొన్నారు.
ఇది చదవండి: మేడారం జాతరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు.. వివరాలు ఇవే..!