భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో హుండీలను లెక్కించారు. పోలీసుల నిఘాలో ఆలయ ఈవో ఆధ్వర్యంలో హుండీల లెక్కింపును కొనసాగించారు.
28 రోజులకు 52 లక్షల 60 వేల 937 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో నరసింహులు తెలిపారు. 28 రోజుల్లో ఉత్సవాలు ఏమీ లేకపోవడం వల్ల స్వల్పంగా తగ్గిందని వెల్లడించారు.
ఇవీచూడండి: 'కరోనాపై పుకార్లు సృష్టిస్తే చర్యలు తప్పవు'