భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో సమస్యలు పేరుకుపోయాయి. సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫలితంగా వైద్యసేవలు అంతంతమాత్రంగా సాగుతున్నాయి. అంబులెన్స్ అందుబాటులో ఉండడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే హరిప్రియ ఇటీవలే ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్‌ను కలిసి వందపడకల ఆస్పత్రి మంజూరు చేయాలని విన్నవించారు. వంద పడకలు తర్వాత... ముందైతే ఉన్న ఆస్పత్రి సేవలు మెరుగు పరచాలని ప్రజలు కోరుతున్నారు.
ఏడు మండలాల ప్రజలు ఆధారపడే ఆస్పత్రిలో కనీస వసతులు లేకపోవడం వైద్యశాఖపై అధికారులకు ఉండే శ్రద్ధకు నిదర్శనమని కొందరు ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో ఏమైనా జరిగితే... ఖమ్మం వెళ్లాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అస్పత్రిపై శ్రద్ధ వహించాలని కోరారు.
ఇదీ చూడండి: 'వాళ్లు లంచాలు ఇస్తే వీళ్లు అనుమతి పత్రాలు ఇస్తారు'