ETV Bharat / state

High Court: విచారణ జరుగుతుండగా మరో కేసా.. పోలీసులకు హైకోర్టు హెచ్చరిక..! - హైకోర్టు ఆగ్రహం

పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తిపై కేసు విచారణ జరుగుతుండగానే మరో కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పోలీసులు కక్షసాధింపు చర్యతోనే కేసు పెట్టినట్లుందని వ్యాఖ్యానించింది. పద్ధతి మార్చుకోకపోతే సీబీఐ దర్యాప్తునకు అప్పగించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

High Court
హైకోర్టు
author img

By

Published : Apr 3, 2022, 10:18 AM IST

సైబరాబాద్‌ పరిధి బాచుపల్లి పోలీసు స్టేషన్‌లో ఓ వ్యక్తిపై పెట్టిన కేసు విచారణ ఇక్కడ కొనసాగుతుండగా.. కక్షసాధింపు చర్యగా వేరే స్టేషన్‌లో తీవ్ర నేరారోపణలతో మరో కేసు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. టి.ప్రభాకర్‌రావుపై బాచుపల్లి ఠాణాలో నమోదైన కేసులో కోర్టుకు రెండుసార్లు హాజరైన నగర పోలీసు కమిషనర్‌ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మరోసారి గడువు కోరారు. ఈ కేసు విచారణ సాగుతుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీసు స్టేషన్‌లో ఐపీసీతో పాటు అసాంఘిక కార్యకలాపాల చట్టం, రాష్ట్ర భద్రతా చట్టాల కింద తీవ్రమైన నేరారోపణలతో మరో కేసు నమోదు చేశారు. దీన్ని సవాలు చేస్తూ ప్రభాకర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు.

సహ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తీవ్ర ఆరోపణలతో కేసు పెట్టారని పిటిషనర్‌ తరఫున న్యాయవాది టి.ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. నిషేధిత మావోయిస్టు గ్రూపునకు రూ.3.34 లక్షలు అందజేశారంటూ ఆరోపించారన్నారు. బాచుపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో నగర పోలీసు కమిషనర్‌ కోర్టుకు హాజరవుతున్నారని, ఈ దశలో కక్షసాధింపుగా మరో కేసు పెట్టారన్నారు. వాదనలు విన్న జస్టిస్‌ కె.లక్ష్మణ్‌.. ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే పోలీసులు కక్షసాధింపు చర్యతో కేసు పెట్టినట్లుందని వ్యాఖ్యానించారు. పోలీసులు, పిటిషనర్‌ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారని, దీనికి సంబంధించి స్పష్టమైన వివరణ తీసుకురావాలని ప్రభుత్వ న్యాయవాది టి.శ్రీకాంత్‌రెడ్డికి సూచించారు. అంతేగాక ఈ రెండు కేసుల దర్యాప్తును డీజీపీ స్వయంగా పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. లేదంటే సీబీఐ దర్యాప్తునకు అప్పగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దుమ్ముగూడెం పోలీసులు పెట్టిన కేసులో అరెస్ట్‌ సహా విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ తదుపరి విచారణను ఈనెల 12కి వాయిదా వేశారు. ఈ ఉత్తర్వుల కాపీని డీజీపీకి అందజేయాలని ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశించారు.

ఇదీ చూడండి: ఆగని బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.