ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి విరామం లేకుండా వాన కురుస్తోంది. జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం(Rain effect in khammam) పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వాన(Rain effect in khammam) కురుస్తోంది. మధిర, బోనకల్లు, ఎర్రుపాలెం, వైరా, ఏన్కూరు మండలాల్లో వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నగరంలో పాండురంగాపురం, దానావాయిగూడెం, టీఎన్జీవో కాలనీ, మోతీనగర్, శివారు ప్రాంతాల్లో నీరు నిలిచింది. మున్నేరులోకి వరద నీరు వచ్చి చేరుతోంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో.. భద్రాద్రి రామయ్య సన్నిధి నిర్మానుష్యంగా మారింది. ప్రతిరోజు భక్తులతో కళకళలాడే ఆలయ పరిసరాలు వెలవెలబోయాయి.
నిలిచిన రాకపోకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో వరద పోటెత్తింది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ముంపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు రావడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పాల్వంచ మండలంలోని ఏడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ పట్టణంలోని తెలంగాణ నగర్, శ్రీనివాస కాలనీ ఒడ్డుగూడెం, కేసీఆర్ నగర్, రాహుల్ గాంధీ నగర్, సోనియా నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మణిదీప్ సూచించారు.
వేల ఎకరాల్లో పంటనష్టం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాని(Rain effect in khammam)కి భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దమ్ముగూడెం మండలాల్లోని పంట పొలాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. కొద్దిరోజుల క్రితమే నాట్లు వేశామని.. ఇప్పుడు పంటంతా నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను కాపాడాలని కోరారు.