ETV Bharat / state

Seethamma Sagar: సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి రుణం.. ఉత్తర్వులు జారీ

author img

By

Published : Jul 24, 2021, 4:56 AM IST

సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రుణ తీసుకోనుంది. పవర్ పైనాన్స్​ నుంచి రూ.3,426 కోట్లు అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అందుకు సంబంధించిన విధివిధానాల్లో మార్పులు, చేర్పులకు ఆమోదం తెలిపింది.

Seethamma Sagar
సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మించే సీతమ్మ సాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా రుణం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పవర్ ఫైనాన్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 3,426 కోట్ల రూపాయల అప్పు తీసుకునేందుకు అనుమతించిన ప్రభుత్వం.. విధివిధానాల్లో మార్పులు, చేర్పులకు ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్​తో ఒప్పందం చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ఎండీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కరీంనగర్ జిల్లా వీణవంక గ్రామం సమీపంలో కలువల వాగుపై నిర్మించే చెక్ డ్యాం నిర్మాణ వ్యయాన్ని ప్రభుత్వం సవరించింది. కోటి 97 లక్షల రూపాయల వ్యయానికి 2016 జనవరిలో పరిపాలనా అనుమతులు ఇవ్వగా.. తాజాగా ఆ మొత్తాన్ని రెండు కోట్ల 45 లక్షల రూపాయలకు నిర్మాణ వ్యయాన్ని పెంచింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

37 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం..

దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద రాష్ట్ర ప్రభుత్వం 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కొత్త బ్యారేజ్ నిర్మించేందుకు సిద్ధమైంది. సీతమ్మ సాగర్ పేరుతో నిర్మించే బ్యారేజీకి ప్రభుత్వం గతంలోనే సుమారు రూ.3 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే సుమారు గోదావరి నదికి ఇరువైపులా 40 కిలోమీటర్ల మేర గోదావరి జలాలు నిండుగా ఉండనున్నాయి. వేసవికాలంలో తాగు, సాగు, పరిశ్రమలకు నీటి కష్టాలు తీరనున్నాయి.

ఇవీ చూడండి:

సీతమ్మ సాగర్​ నిర్మాణానికి భూసేకరణ

'భూమికి భూమి పరిహారం ఇవ్వాలి... ఆ తర్వాతే సీతమ్మ సాగర్ నిర్మాణం'

'సీతమ్మ సాగర్​ భూసేకరణ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.