భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు 22 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం.. ఇవాళ ఉదయం 6 గంటలకు 34.6 అడుగులకు పెరిగింది. 10 గంటలకు 36 అడుగులకు చేరింది.
నీటిమట్టం 43 అడుగుల వరకు పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎన్.వి రెడ్డి తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోకి జాలర్లు, స్నానాలు చేసేవారు వెళ్లరాదని ఆదేశించారు. భద్రాచలం స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఎవరు వెళ్లకుండా ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు.