భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బొల్లేరుగూడెంలోని ఓ ఇంట్లో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. విషయం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. షాట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 5 లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని బాధితులు వాపోయారు.
ఇవీ చూడండి: పరామర్శలు వద్దు న్యాయం కావాలి...