భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ఓ బాధిత కుటుంబం ధర్నా చేసింది. జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన ముస్తఫా 2010లో ఓ ఎల్ఐసీ ఏజెంట్ వద్ద రూ.85వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు నిర్ణయించుకుని డబ్బు అప్పజెప్పాడు. కానీ ఆ ఏజెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండా 4 పాలసీలుగా విభజించి మోసం చేశాడని బాధితులు ఆరోపించారు. తమ కూతురు పెళ్లి కోసమని కష్టపడి సంపాదించిన ధనాన్ని 2010లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా.. వాటిని పాలసీలుగా విభజించారని వాపోయారు. తమకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరమించబోమని తెలిపారు. వారికి జరిగిన అన్యాయాన్ని స్థానిక ఎల్ఐసీ కార్యాలయంలోని మేనేజర్‌తో చర్చించారు. తమకు న్యాయం చేయాలని... కట్టిన డబ్బులకు వడ్డీ రాకపోయినా అసలు డబ్బులు ఇప్పించాలంటూ కుటుంబ సభ్యులు ధర్నా చేశారు.
పెళ్లి కోసం డిపాజిట్ చేస్తే పాలసీలు చేశాడు - telangana latest news
ఎల్ఐసీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానంటూ ఓ ఏజెంట్ ఎల్ఐసీ ఖాతాదారులను మోసం చేశాడు. రూ.85వేలను తమకు తెలియకుండానే నాలుగు పాలసీలుగా విభజించాడని ఆరోపించారు. భద్రాచలంలో జరిగిన ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ బాధితుల కుటుంబం ఆందోళన చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ఓ బాధిత కుటుంబం ధర్నా చేసింది. జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన ముస్తఫా 2010లో ఓ ఎల్ఐసీ ఏజెంట్ వద్ద రూ.85వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు నిర్ణయించుకుని డబ్బు అప్పజెప్పాడు. కానీ ఆ ఏజెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండా 4 పాలసీలుగా విభజించి మోసం చేశాడని బాధితులు ఆరోపించారు. తమ కూతురు పెళ్లి కోసమని కష్టపడి సంపాదించిన ధనాన్ని 2010లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా.. వాటిని పాలసీలుగా విభజించారని వాపోయారు. తమకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరమించబోమని తెలిపారు. వారికి జరిగిన అన్యాయాన్ని స్థానిక ఎల్ఐసీ కార్యాలయంలోని మేనేజర్‌తో చర్చించారు. తమకు న్యాయం చేయాలని... కట్టిన డబ్బులకు వడ్డీ రాకపోయినా అసలు డబ్బులు ఇప్పించాలంటూ కుటుంబ సభ్యులు ధర్నా చేశారు.
Body:ధర్నా
Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట కొందరు బాధితులు ధర్నా నిర్వహించారు జిల్లాలోని బూర్గం పాడు మండలం సారపాక గ్రామానికి చెందిన ఎండి ముస్తఫా వద్ద 2010లో ఫిక్స్డ్ డిపాజిట్ పేరిట ఎల్ఐసీలో ఒక ఏజెంట్ 85000 కట్టించుకొని తరువాత వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేయకుండా 4 పాలసీలు గా విభజించి మోసం చేశారని అని ధర్నా చేపట్టారు ఇప్పుడు రావలసిన డబ్బులు అడగగా మీరు కట్టిన 85000 కూడా రావని కేవలం 65 వేలు మాత్రమే వస్తాయని అని తెలపడంతో బాధితుడు కుటుంబ సభ్యులతో ధర్నా చేపట్టాడు ఎల్ఐసి కార్యాలయంలోని మేనేజర్ తో చర్చించారు బాధితునికి న్యాయం చేయాలని అని అతను కట్టిన డబ్బులకు వడ్డీ రాకపోయినా అసలు డబ్బులు అయినా ఇప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు