భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చర్ల ప్రధాన రహదారి ప్రాంతంలో గల తెగడ వద్ద పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరను వెలికితీశారు. అనంతరం నిర్వీర్యం చేశారు. ఇంకా పలుచోట్ల మావోయిస్టులు మందుపాతరలు అమర్చి ఉంటారనే నేపథ్యంలో బాంబు స్క్వాడ్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.
ఆవిర్భావ వేడుకల నేపథ్యంలోనే..
ఈ నెల 21 నుంచి 28 వరకు మావోయిస్టుల ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన రహదారి సమీపంలో మందు పాతరలను గుర్తించేందుకు పోలీసులు రహదారికి ఇరువైపులా రాకపోకలను నిలిపివేశారు.