భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో దసరా వేడుకలను వైభవంగా నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం సోమవారం సాయంత్రం ఆలయంలోని బేడా మండపం వద్ద ముందుగా లక్ష్మణ సమేత సీతారాములకు పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. తర్వాత శమీ పూజ, ఆయుధ పూజ వైభవంగా నిర్వహించారు.
అనంతరం రామయ్య తండ్రి ఆయుధాలైన ధనుర్భాణాలు, కత్తి, గద, బడిసలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత రామలీల మహోత్సవంలో భాగంగా రావణ సంహార వేడుకను వైభవంగా జరిపారు. ఆలయ ఈవో శివాజీ రావణుడి బొమ్మను దహించగా వేడుకలు అంబరాన్నంటాయి.
ఇదీ చదవండిః ఓరుగల్లులో గంగమ్మ ఒడికి చేరిన దుర్గా దేవి