భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసి వలస కుటుంబాలకు టీఎన్టీయూసీ నాయకులు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఛత్తీస్‌ఘడ్ నుంచి వచ్చిన 30 వలస కుటుంబాలు.. కరోనా నేపథ్యంలో పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
వీరికి సాయం అందించేందుకు టీఎన్టీయూసీ నాయకులు ముందుకు వచ్చి... వారందరికీ బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని... లాక్డౌన్ నిబంధనలను పాటించాలని సూచించారు.
ఇదీ చదవండిః హైదరాబాద్‌ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..