CRPF Jawans Republic Celebrations With Tribals: తెలంగాణ- ఛత్తీస్‌ఘఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నిన్న 74వ గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని లేఖ విడుదల చేయడంతో.. నేడు సీఆర్పీఎఫ్ జవానులు గిరిజనులతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అందరూ ఆడిపాడి అలరించారు. గిరిజనులతో కలిసి ఆడుతూపాడుతూ ఎంతో ఉత్సాహంగా జవానులు గడిపారు.
తెలంగాణ సరిహద్దులో ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కిష్టారంతో పాటు.. వివిధ క్యాంపులలో ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు.. అక్కడి గిరిజనులతో కలిసి గణతంత్ర వేడుకలను నిర్వహించారు. గిరిజనులతో పాటు సీఆర్పీఎఫ్ జవానులు వారి సాంప్రదాయం నృత్యాలు చేసి.. గిరిజనులతో పాటు సహ పంక్తి భోజనాలు చేశారు. జవానులు వైద్య బృందాన్ని తీసుకెళ్లి గిరిజనులకు ఆరోగ్య పరీక్షలు చేసి.. మందులను పంపిణీ చేశారు. గిరిజన యువకులకు పండ్లును అందించారు.
మావోయిస్టు నాయకుడు ఆజాద్ విడుదల చేసిన లేఖతో సీఆర్పీఎఫ్ బలగాలు అడవుల్లోని క్యాంపులలో కాకుండా.. క్యాంపుల బయటకు వచ్చి గిరిజనుల మధ్య గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో 212 బెటాలియన్ కమాండెంట్ దీపక్ కుమార్ శ్రీవాస్తవ్, డిప్యూటీ కమాండెంట్ రాజేంద్ర సింగ్, అసిస్టెంట్ కమాండెన్స్ నిశంత్, కృష్ణన్, రాజ్‌పాల్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: