భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఎం.వి.వి రెడ్డి ప్రారంభించారు. కొత్తగూడెంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యురాలికి మొదటి టీకాను వేశారు.
జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కొత్తగూడెంలో 2, ఇల్లందు, భద్రాచలంలో ఒక్కో కేంద్రంలో టీకాలు వేయనున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకి 30మంది చొప్పన ఈ టీకా వేయనున్నారు.
ఇదీ చదవండి: చారిత్రక ఘట్టం: టీకా పంపిణీకి మోదీ శ్రీకారం