సీసీఐ ద్వారా ఏర్పాటైన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాకలోని శ్రీరామ కాటన్ ఇండస్ట్రీస్‌లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. పండించిన పత్తిని సీసీఐ కేంద్రాల ద్వారా అమ్మకాలు జరిపి ప్రయోజనం పొందాలన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి ఆందోళన చేయవద్దని, ఏ సమస్య ఉన్నా తనను సంప్రదిస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సన్న రకానికి మద్ధతు ధర ఇవ్వాలి: రైతులు