ETV Bharat / state

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజృంభిస్తోన్న కొవిడ్​

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి నుంచి కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి. కానీ తాజాగా సింగరేణి ప్రాంతాల్లో కొవిడ్​ విజృంభిస్తోంది. ఇల్లందులో రెండో కరోనా కేసు నమోదు కావడం, వైరస్​ సోకిన యువతి మృతి చెందడం వల్ల ప్రజలు ఆందోనళకు గురవుతున్నారు.

corona death in badradri kothagudem district
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజృంభిస్తోన్న కొవిడ్​
author img

By

Published : Jul 2, 2020, 2:57 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రెండో కరోనా కేసు నమోదయింది. వైద్యం కోసం హైదరాబాద్​కు వెళ్లిన సింగరేణి కార్మికుడికి మొదటగా వైరస్​ సోకగా.. తాజాగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్​కు డయాలసిస్​ కోసం వెళ్లి వచ్చిన 23 సంవత్సరాల యువతికి కరోనా నిర్ధరణయింది. ఆమెను చికిత్స కోసం హైదరాబాద్​కు తరలిస్తున్న క్రమంలో మృతి చెందడం వల్ల పట్టణ ప్రజలతోపాటు అధికారులు ఆందోళనకు గురయ్యారు. వైద్య సిబ్బంది ప్రైమరీ కాంటాక్ట్స్ కనుక్కునే పనిలో పడ్డారు.

ఇప్పటికే ప్రైమరీ కాంటాక్ట్​గా 10 మందిని గుర్తించారు. రెండు కేసుల్లోనూ హైదరాబాద్​కు వైద్యానికి వెళ్లిన వారికే వైరస్​ సోకడం ఆందోళన కలిస్తోన్న అంశం. కరోనాతో మృతి చెందిన యువతి అంత్యక్రియలు నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చూడండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.