భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గ నేత రవి ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టుపై కొత్తగా నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన దీక్ష చేపట్టారు.
రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో హస్తం నేతలు జీవీ భద్రం, వెంకటేశ్వర్లు, మహేష్, నవీన్ పాల్గొన్నారు
ఇవీ చూడండి: పోతిరెడ్డిపాడుపై కేంద్ర మంత్రి స్పందన