సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసేందుకు ప్రయత్నిస్తోన్న ప్రతిపక్ష పార్టీల గొంతును తెరాస ప్రభుత్వం నొక్కేస్తోందని హస్తం నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టు వద్దకు వెళ్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అంతకుముందు మణుగూరు, అశ్వాపురం, పినపాకలోని కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెరాస ప్రతిపక్ష పార్టీల నాయకులను అక్రమంగా నిర్బంధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాగే ప్రవర్తిస్తే భవిష్యత్తులో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!