ETV Bharat / state

ప్రైవేట్ వాళ్లెలా తీస్తారు బొగ్గు.. భగ్గుమన్న కార్మిక లోకం - కేంద్రం నిర్ణయం

ప్రైవేట్ సంస్థలకు బొగ్గు గనుల కేటాయింపుపై కేంద్ర వైఖరి పట్ల దేశ వ్యాప్తంగా కార్మిక లోకం మండిపడుతోంది. ఇప్పటివరకు ఉపరితల గనుల్లో మట్టి తొలగింపు, బొగ్గు వెలికితీత వంటి పనులకు మాత్రమే ప్రైవేట్ సంస్థలు పరిమితమయ్యాయి. తాజా కేటాయింపుల్లో ప్రైవేట్ సంస్థలు కూడా బొగ్గు వెలికితీసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు.

వెంటనే నిర్ణయం ఉపసంహరించుకోవాలి : కార్మికులు

author img

By

Published : May 30, 2020, 3:17 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సహా వివిధ ప్రాంతాల్లోని సింగరేణి ఏరియాల్లోని కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

కరోనా లాక్​డౌన్ కారణంగా పరిశ్రమలు, కార్మికులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేంద్రం కొన్ని బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అంశాన్ని తెరమీదికి తెచ్చింది. ఏడేళ్ల క్రితం వరంగల్ జిల్లా తాడిచర్ల బొగ్గు బ్లాకులను ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించింది కేంద్రం. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు కార్మికులు. ఫలితంగా కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో ప్రధాన బొగ్గు సంస్థ సింగరేణిలో ఎలాంటి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు కేటాయించకపోయినా.. కేంద్రం నిర్ణయంతో ప్రైవేట్ సంస్థలు బొగ్గు బ్లాకులను పొందే అవకాశం ఏర్పడటంపై కార్మికులు భగ్గుమంటున్నారు.

పోటీ పడాల్సిన దుస్థితికి సింగరేణి..

ప్రస్తుతం 50 బ్లాకులకు టెండర్లు ప్రారంభం కానున్నాయి. ఈ టెండర్లలో ప్రైవేట్ సంస్థలతో సింగరేణి కూడా పోటీ పడాల్సిన దుస్థితి ఎదురుకానుంది. సింగరేణితో పోల్చితే ప్రైవేట్ సంస్థల వేతనాలు స్వల్పంగా ఉండటం వల్ల వాటితో సింగరేణి పోటీపడటం భారంగా మారనుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఉద్యోగ భద్రతపై అనుమానాలు !

ప్రైవేట్ సంస్థలతో సింగరేణి పోటీపడాలంటే ఉత్పత్తి మరింత తగ్గించుకోవాలని అధికారులు వాదిస్తున్నారు. దుబారా ఖర్చులను తగ్గించుకుని సంస్థ తనకు తాను మరింత క్రమబద్ధీకరించుకుంటూ ప్రైవేట్ సంస్థలతో ఖర్చు వ్యత్యాసాన్ని తగ్గించుకునే వీలు కలుగుతుందంటున్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం తెరమీదికి తేవడం వల్ల కార్మికుల్లోని ఉద్యోగ భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఉపసంహరించకుంటే ఉగ్ర రూపమే..

ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు.. జాతీయ స్థాయిలో ఈ అంశంపై ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మార్చి నెల వేతనం కోతపై ఉద్యమిస్తున్న కార్మిక సంఘాలకు.. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉద్యమం ఉగ్ర రూపం దాల్చనుంది. మరోవైపు సంఘాలు కార్మికులను చైతన్యం చేసి కేంద్రం తీరును ఎండగట్టేందుకు చర్యలు చేపడుతున్నారు.

వారి దోపిడీని సింగరేణి తట్టుకోలేదు !

బొగ్గును ప్రైవేట్ సంస్థలు వెలికితీసే అవకాశాలు కల్పిస్తే ప్రభుత్వ రంగ సంస్థ కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. అధిక యంత్రాలతో శ్రామిక శక్తిని తగ్గిస్తూ.. తక్కువ వేతనాలిస్తూ ప్రైవేట్ సంస్థలకు శ్రమ దోపిడి చేసే అవకాశం కల్పించిన కేంద్రంపై కార్మిక లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళనకు దిగనున్నారు.

ఇవీ చూడండి : దేశంలో 24 గంటల్లోనే 7964 కేసులు, 265 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.