ETV Bharat / state

ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభించాలి: సీఎంవో

author img

By

Published : May 11, 2021, 10:15 PM IST

సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్​ సింగరేణి విశ్రాంత భవనంలో జలవనరుల ఇంజినీరింగ్​ అధికారులు, ఎల్​ అండ్​ టీ ఏజెన్సీలతో సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్​ ప్రాజెక్టు పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరులోగా సీతమ్మ సాగర్​ బహుళార్థసాధక ప్రాజెక్టు కాపర్​ డ్యాం కాంక్రీట్​ పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

smitha
smitha

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామం వద్ద చేపట్టిన సీతమ్మ సాగర్​ బహుళార్థసాధక ప్రాజెక్టు కాపర్​ డ్యాం కాంక్రీట్​ పనులు ఈ నెలాఖరులోగా ప్రారంభించాలని సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్...​ జనవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్​ ద్వారా మణుగూరు చేరుకున్న స్మితాసబర్వాల్​ సింగరేణి విశ్రాంత భవనంలో జలవనరుల ఇంజినీరింగ్​ అధికారులు, ఎల్​ అండ్​ టీ ఏజెన్సీలతో సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్​ ప్రాజెక్టు పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

36.57 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో... సీతమ్మ సాగర్​ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి సమృద్ధిగా సాగునీరు అందించేందుకు నీటి నిల్వ సామర్థ్యం కోసం నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి :

  • లాక్​డౌన్​ ఎఫెక్ట్​: వైన్సుల ముందు బారులు తీరిన మందుబాబులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.