రక్తం దానం చేయడం గొప్ప విషయమని... ఇలా రక్తదానం చేసిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు తెరాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు. సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి నామా హాజరయ్యారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దాదాపు 500 మంది తలసేమియా బాధిత చిన్నారులకు రక్తం అందించాలనే లక్ష్యంతో సత్తుపల్లిలో ఎమ్మెల్యే మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యువకులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం పట్ల సండ్ర హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'కరోనా వ్యాప్తి నియంత్రణలో భారత్ భేష్'