భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల వల్ల భక్తులు నలుమూలల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు సీతారామచంద్ర స్వామిని దర్శించుకుంటున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాలన్ని రద్దీగా మారాయి. ప్రతి శనివారం లాగానే అంతరాలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు బంగారు తులసీదళాలతో అర్చన చేశారు. రోజూ జరిగే నిత్య కళ్యాణం వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఇవీ చూడండి : ఎయిర్ ఇండియా సేవలకు 6 గంటలు బ్రేక్