భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 9వ రోజైన నేడు రామయ్య శ్రీకృష్ణుని అవతారంలో దర్శనమిచ్చారు. మేళతాళాలు, మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారిని ప్రధాన ఆలయం నుంచి బేడా మండపం వద్దకు తీసుకువచ్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుప్పావై పాశురాలను పారాయణం చేశారు.
రేపు సాయంత్రం స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. 6వ తేదీ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఇవీ చూడండి: పంచాయతీ కార్మికులకు తీపి కబురు