భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి మండలంలో జరిగిన గ్రామ వ్యవసాయ ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం సూచించిన పంటలనే అన్నదాతలు వేయాలని ఆయన కోరారు.
మొక్కజొన్న పంటను వేయొద్దని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. సబ్సిడీపై పచ్చి రొట్ట విత్తనాలు రైతులకు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో స్వర్ణలత, డీపీవో ఆశాలత, హార్టికల్చర్ అధికారి మరియన్న, జేడీఏ అభిమన్యు, సొసైటీ ఛైర్మన్ లక్కినేని సురేందర్, ఎంపీపీ రాధ, సర్పంచ్ సరిత పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నియంత్రిత సాగుతో దేశానికి సందేశం: గుత్తా సుఖేందర్