భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన గంటా వెంకటరామారావు కుమారుడు నాగేంద్ర ప్రభాస్ సెప్టెంబర్ 13న జరిగిన ఆలిండియా మెడికల్ నీట్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించి... తల్లిదండ్రులతో పాటు స్థానికుల మన్ననలు పొందాడు. వ్యవసాయ కుటుంబంలో జన్మించి ప్రభాస్... డాక్టర్ విద్య చదివి సమాజానికి సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభాస్ తెలిపారు.
తల్లిదండ్రులు, మేనమామ ప్రోత్సాహంతో పదో తరగతిలో 9.8, ఇంటర్లో 9.9 సాధించి... ప్రథమస్థానంలో నిలిచారు. తాజాగా వెలువడిన నీట్ ఫలితాల్లో ఆలిండియా 6,860 ర్యాంకు సాధించి తన సత్తా చాటుకున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు రావాలని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.
ఇవీ చూడండి: వరద బాధితులకు మంత్రి కేటీఆర్ పరామర్శ