ప్రమాదవశాత్తు వంతెన పైనుంచి కింద పడిన యాచకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి నది వంతెనపై నుంచి ఓ యాచకుడు అకస్మాత్తుగా నదిలో పడ్డాడు. ఇసుకలో పడడం వల్ల ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు.. లాంచీలో వెళ్లి ఆ యాచకుడిని కాపాడారు. మతి స్థిమితం లేకపోవడంతో వంతెన పైనుంచి పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: కేసీఆర్కు దిల్లీ పర్యటన తర్వాత ఏమైంది: వీహెచ్