ETV Bharat / state

బంధుత్వం భయపడింది.. మానవత్వం ముందుకొచ్చింది..

author img

By

Published : Jun 20, 2021, 3:58 PM IST

కరోనా, బ్లాక్ ఫంగస్​తో మృతిచెందితే రక్తసంబంధీకులు సైతం అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకురాని తరుణంలో మేమున్నామంటూ కొందరు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. పెద్దదిక్కు లేని కుటుంబాల విజ్ఞప్తి మేరకు బట్ట మల్లయ్య మెమోరియల్ ట్రస్ట్​ నిర్వాహకులు అంత్యక్రియలు నిర్వహించి అందరి అభినందనలు అందుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో చోటు చేసుకుంది.

బట్ట మల్లయ్య మెమోరియల్ ట్రస్ట్​
బట్ట మల్లయ్య మెమోరియల్ ట్రస్ట్​

బ్లాక్ ఫంగస్​తో చనిపోయిన వారికి అంతిమ గౌరవం దక్కడం లేదు. చివరికి రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు సైతం ఒంటరిగా వదిలేస్తున్నారు. అలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో జరిగింది. కృష్ణసాగర్ పంచాయితీ ఎస్​టీ కాలనీకి చెందిన భూక్య రవీందర్ బ్లాక్ ఫంగస్​తో హైదరాబాద్​లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. భయపడిన బంధువులు అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాలేదు.

విషయం తెలుసుకున్న బట్ట మల్లయ్య మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు బట్ట విజయ్ గాంధీ దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. కొవిడ్​తో మృతిచెందిన వ్యక్తిపై వైరస్ 30 నిమిషాలు మాత్రమే ఉంటుందని... తర్వాత వైరస్ ఉండదని విజయ్ గాంధీ తెలిపారు. ఎవరైనా కరోనాతో మరణిస్తే కుటుంబ సభ్యులు జాగ్రత్తలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి: SCHOOLS OPEN: పొంచి ఉన్న కరోనా మూడో దశ ముప్పు.. విద్యాసంస్థల రీఓపెన్​ అవసరమా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.