ETV Bharat / state

ఆదివాసీ కుటుంబాలకు ఎస్పీ సునీల్​ దత్​ చేయూత - badradri news updates

వలస వచ్చిన ఆదివాసీ కుటుంబాలకు ఎస్పీ సునీల్​ దత్​ చేయూతను అందిస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల వారికి ఉచిత వాటర్ ఫిల్టర్​లను పంపిణీ చేశారు.

badradri sp, sunil dutt distributed water filters
ఆదివాసీ కుటుంబాలకు ఎస్పీ సునీల్​ దత్​ చేయూత
author img

By

Published : Apr 1, 2021, 9:57 AM IST

భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్​ దత్​.. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో వలస వచ్చిన ఆదివాసీ కుటుంబాలకు చేయూత అందిస్తున్నారు. జిల్లాలోని పలు గ్రామాల వారికి ఉచిత వాటర్ ఫిల్టర్​లను పంపిణీ చేశారు. గుత్తి కోయ గ్రామాలకు చెందిన వలస గిరిజన కుటుంబాలకు ఇంటికొక వాటర్ ఫిల్టర్​ అందజేశారు.

ఆదివాసీలకు సురక్షిత నీరు అందించేందుకు ఈ ఫిల్టర్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని వ్యాధులు రాకుండా కాపాడుకోవాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ గిరిజన యువత చెడు మార్గంలో నడవకూడదనే ఉద్దేశంతో... పలు రకాల క్రీడాల్లో పాల్గొనాలని తెలిపారు. జిల్లాలో గిరిజన వలస ఆదివాసీల సంక్షేమం కోసం పోలీసుశాఖ ఎల్లప్పుడూ సహకారాలు అందిస్తుందని భరోసానిచ్చారు.

ఇవీచూడండి: పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడి ఇంట్లో ఎన్​ఐఏ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.