ETV Bharat / state

చరిత్ర: భద్రాద్రి బ్రిడ్జీ నిర్మాణానికి ఆ దుర్ఘటనే కారణమా? - Godavari River latest News

దక్షిణ భారత అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి రాములోరి దర్శనం ఒకప్పుడెంతో కష్టం. గోదారిలో పడవ ప్రయాణం చేస్తేనే రామయ్యను చూడడం సాధ్యం. ఓ సారి జరిగిన పడవ ప్రమాదం భద్రాద్రి రూపురేఖలనే మార్చేసింది. ఒకేసారి సుమారు 150మంది చనిపోవడంతో సర్కారు అప్రమత్తమైంది. అక్కడ ఓ భారీ వంతెన నిర్మించింది. ఆ బ్రిడ్జీ నిర్మించి 155 ఏళ్లు గడుస్తున్న తరుణంలో "ఈటీవీ భారత్" ప్రత్యేక కథనం...

badrachalam-bridge-has-completed-55-years-which-was-built-across-godavari-river-in-badradhri-kothagudem-district
చరిత్ర: భద్రాద్రి బ్రిడ్జీ నిర్మాణానికి ఆ దుర్ఘటనే కారణమా?
author img

By

Published : Jul 14, 2020, 6:13 PM IST

భద్రాచలంలో ఆ వారథి 55 ఏళ్లు పూర్తి చేసుకుంది..

భద్రాచలానికి గతంలో వాహన రాకపోకలు ఉండేవికావు. ఏటా శ్రీరామనవమి ముక్కోటి ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భద్రాచలం గోదావరి అవతల ఒడ్డున గల బూర్గంపాడు మండలం గుమ్మూరు నుంచి కాలినడకన గోదావరి నది వరకు వచ్చి అక్కడినుంచి పడవలో ప్రయాణించేవారు. అప్పుడే భద్రాచలం పుణ్యక్షేత్ర దర్శనం సాధ్యమయ్యేది.

ఆ ప్రమాదంతో వంతెనకు శ్రీకారం...

1959వ సంవత్సరంలో శ్రీరామనవమి ఉత్సవాలకు భక్తులు రెండు పడవలను జాయింట్ చేసి గోదావరి నదిపై భద్రాచలం వైపు వస్తుండగా మునిగిపోయాయి. ఆ ఘటనలో సుమారు 150 మంది నదిలో మునిగి చనిపోయారు. అప్పటి ప్రభుత్వం స్పందించి భద్రాచలం గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గోదావరి నది వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి నిర్మించేందుకు 1959 నుంచి 1965 వరకు ఆరేళ్ల సమయం పట్టింది.

రాష్ట్రపతి చేతుల మీదుగా..

జూలై 13, 1965లో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వంతెనకు ప్రారంభోత్సవం చేశారు. ఫలితంగా భద్రాచలం పుణ్యక్షేత్రానికి వాహన రాకపోకలు మొదలయ్యాయి. జూలై 13, 2020 నాటికి ఆ వారధి 55 ఏళ్లు పూర్తి చేసుకుంది.

కొత్త వంతెన 70 శాతం పూర్తయింది...

ప్రస్తుతం వంతెనపై చిన్న మరమ్మతులు జరుగుతుండగా.. నూతన వంతెనను నిర్మించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గోదావరి నదిపై నిర్మిస్తున్న రెండవ వంతెన పనులు 70 శాతం వరకూ పూర్తయ్యాయి. రెండో వంతెన నిర్మాణం కూడా పూర్తైతే రెండు వంతెనలపై వాహనాలు తిరిగేందుకు అవకాశం కలుగుతుంది. తద్వారా పాత వంతెనపై రద్దీని తగ్గించవచ్చని ప్రభుత్వ ఉద్దేశం. గత 55 ఏళ్ల నుంచి భద్రాచలం ప్రజల రాకపోకలకు పుణ్యక్షేత్రం అభివృద్ధికి పాత వారథి తోడ్పాటు ఇచ్చింది. అప్పటి వారథిపైనే ప్రస్తుతం రోజుకు వేల సంఖ్యలో వాహన రాకపోకలు సాగుతున్నాయి.

ఇవీ చూడండి : 'పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బంది పెరగాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.