ETV Bharat / state

రామయ్య కల్యాణానికి ఏర్పాట్లు ముమ్మరం

భద్రాద్రి ఆలయంలో సీతారామ స్వామి వారి కల్యాణానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

భద్రాద్రి
author img

By

Published : Mar 15, 2019, 9:19 AM IST

శ్రీరామనవమి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం
భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. నెల రోజులే గడువుండటం వల్ల వేడుకల ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏప్రిల్​ 6న అంకురార్పణతో ఉత్సవాలు మొదలవనున్నాయి. ఏప్రిల్​ 14న రామయ్య కల్యాణం, 15న పట్టాభిషేకం జరుగనుంది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నారు.

రూ.1.5 కోట్లు ఖర్చు

స్వామివారి కల్యాణానికి సుమారు రూ.1.5 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో రమేశ్​బాబు తెలిపారు. విద్యుత్​దీపాల అలంకరణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ముఖ్య కూడలిలో తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి :వెంకటేశుని కల్యాణ వేడుకలో సభాపతి

TG_NLG_01_15_Edurkolu_Utsavam_AV_R14 Reporter: I.Jayaprakash Camera: Janardan నోట్: లైవ్ కిట్ ద్వారా వచ్చిన ఫీడ్ వాడుకోగలరు. ---------------------------------------------- ( ) యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎదుర్కోలు ఉత్సవం... కనుల పండువగా సాగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా... ఏడో రోజైన గురువారం రాత్రి నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం వైభవోపేతంగా సాగింది. ఇవాళ జరిగే కళ్యాణ క్రతువులో భాగంగా... బాలాలయంలో స్వామి అమ్మవార్ల గుణ గణాలు తెలిపే ఉత్సవాన్ని, వేద పండితులు శ్రవణానందకరంగా వివరించారు. లోక కల్యాణం కోసం నారసింహుడు ఎత్తిన అవతారాలను... స్వామికి తోడుగా అమ్మవారు ముల్లోకాలను ముందుండి నడిపించిన తీరుని కళ్లకు కట్టినట్లు వివరించారు. అంతకుముందు స్వామి... అశ్వ వాహనంపై తీర్థజనులను కటాక్షించారు. అనంతరం భక్తజనుల జయజయధ్వానాల నడుమ... స్వామి, అమ్మవార్లను పల్లకీల్లో ఊరేగించారు. ఉదయం 11 గంటలకు బాలాలయంలో జరిగే కల్యాణానికి... గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరవనున్నారు. ...........................Vis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.