ఈసారి రికార్డు స్థాయిలో మొక్కజొన్న దిగుబడులు రావడం వల్ల.. ప్రభుత్వం వచ్చే వ్యవసాయ సీజన్‌లో మొక్కజొన్న పంటను ప్రోత్సహించ వద్దని చెప్పింది. నియంత్రిత సాగు విధానంలో ఇతర పంటలు వేసుకోవాలని నిబంధన విధించినందున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో అలజడి నెలకొంది.
కొండలు గుట్టలు రాళ్లతో ఉండే ఏజెన్సీ భూములలో మొక్కజొన్న పంట తప్ప ఇతర పంటలకు అనువైన వాతావరణం ఉండదని ఆదివాసీ గిరిజనులు పోరాటాలు చేశారు. అయితే ఇల్లందు మండలానికి చెందిన 48 మంది రైతులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా మొక్కజొన్న నిషేధిత పంట కాదని హైకోర్టు సూచించడం వల్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులకు న్యాయస్థానం నుంచి స్టే కాపీ రానున్నందున. తాము కూడా తమకు వచ్చిన కాపీ ప్రతిని వ్యవసాయ అధికారులకు ఇవ్వనున్నట్టు రైతు సంఘ ప్రతినిధులు తెలిపారు. కాగా దీనిపై మండల వ్యవసాయ అధికారి సతీశ్‌ను వివరణ కోరగా... తమకు ఉన్నతాధికారుల నుంచి అధికారికంగా ఇంకా సమాచారం రాలేదని తెలిపారు.