భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మీదుగా ఒడిషా నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఒక కారు అనుమానాస్పదంగా కనిపించడం వల్ల ఎస్సై మహేశ్ సోదా చేశారు.
కారులో అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసి.. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. దాని విలువ సుమారు 30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.